ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
ఆడవారిలో పీరియడ్స్ ఆలస్యం అయితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావచ్చు. పిసిఓయస్, థైరాయిడ్ వంటి సమస్యలు దీనికి కారణం కావచ్చు.
మలబద్దకం, ఉబ్బరం, అతిసారం వంటి జీర్ణ లేదా ప్రేగు సంబంధిత సమస్యలు ఉంటే జాగ్రత్తగా ఉండాలి.
జుట్టు రాలడం, జుట్టు పలుచగా ఉండటం వంటివి హార్మోన్ల కారణాలు వల్ల వస్తాయి.
మొటిమలు, జిడ్డు చర్మం, చర్మం పొడిబారడం వంటివి కూడా హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తాయి.
మూడ్ స్వింగ్స్, ఒత్తిడి, నిరాశ, చిరాకు వంటివి హార్మోన్ల సమస్యల వల్ల వస్తాయి.
కారణం లేకుండా బరువు పెరగడం, బరువు తగ్గడం వంటివి జరిగితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా జరుగుతాయి.
ఎప్పుడూ అలసటగా, తక్కువ శక్తితో ఉంటే హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలా జరుగుతుందని గుర్తించాలి.
సరిగా నిద్ర పట్టకపోవడం, నిద్రలేమి, విశ్రాంతిగా అనిపించకపోవడం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తాయి.