ఆడవారిలో కాల్షియం తక్కువ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..!

కండరాల తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాళ్ల వెనుక భాగంలో నొప్పి, తిమ్మిరి, కండరాలు దృఢంగా లేకపోవడం జరుగుతుంది.

చేతి వేళ్లు, కాలి వేళ్లు,  నోటి చుట్టూ జలదరింపులు హైపోకాల్సెమియాకు సంకేతం.  ఇది కాల్షియం లోపం వల్ల వచ్చే సమస్య.

ఎప్పుడూ అలసటగా ఉండటం, బలహీనంగా అనిపించడం కాల్షియం లోపం వల్ల జరుగుతుంది.

కాల్షియం లోపిస్తే చర్మం  పొడిగా, పొరలుగా  మారుతుంది. గోళ్లు పెళుసుగా మారి విరిగిపోతుంటాయి.

కాల్షియం లోపం దీర్ఘకాలం కొనసాగితే బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారి ఎముకల ప్రాంతంలో నొప్పి కలిగిస్తాయి.

దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం.  దంతక్షయం, దంతాలు పెళుసుగా మారడం,  చిగుళ్ల వ్యాధులు వంటి దంత సమస్యలు వస్తాయి.

గుండె పనితీరులో కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపిస్తే అరిథ్మియాకు దారితీస్తుంది. ఇది గుండె కొట్టుకునే స్థితి సక్రమంగా లేని పరిస్థితి.

హైపోకాల్సెమియా నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది నిరాశ, చిరాకు, జ్ఞాపకశక్తి, గందరగోళం వంటి లక్షణాలకు దారితీస్తుంది.