ఈ లక్షణాలున్న అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట..!
అబ్బాయి మాటల్లో హాస్యం ఉంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట. నవ్వుతూ, జోక్ చేస్తూ, సరదాగా ఉండే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టమట.
అబ్బాయిలలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఉంటే అమ్మాయిలు ఇష్టపడతారు. సంకోచించే వారు లేదా ఇతరులకు లొంగిపోయే అబ్బాయిలంటే అమ్మాయిలకు అస్సలు నచ్చదు.
అమ్మాయిలకు నమ్మకం, భరోసా ఇవ్వగలిగే అబ్బాయిల పట్ల ఆకర్షితులవుతారు. ఏ అబ్బాయి దగ్గర అయితే సెక్యురిటీ ఫీలింగ్ ఉంటుందో అలాంటి అబ్బాయిల పట్ల ఇంప్రెస్ అవుతారు.
అమ్మాయిలు తాము చెప్పే విషయాలను గౌరవించే అబ్బాయిలను ఇష్టపడతారు. అమ్మాయిలు చెప్పిన విషయాల పట్ల తమ అభిప్రాయాలు చెప్పడం, అమ్మాయిల అభిప్రాయానికి పాజిటివ్ గా స్పందించే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఇష్టం.
తమ ఆరోగ్యం, ఫిట్నె్స్ పట్ల శ్రద్ద వహించే అబ్బాయిలు భిన్నమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇలా ఫిట్ గా, భిన్న వ్యక్తిత్వంతో ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారు.
విషయ సమాచారం, జ్ఞానం మెండుగా ఉన్న అబ్బాయిలంటే అమ్మాయిలకు బాగా ఇష్టం.
ఏదైనా పనిని సీరియస్ గా, బాధ్యతాయుతంగా పూర్తీ చేసే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఇష్టం.