ప్రపంచంలో అత్యంత భారీ పక్షులు ఏవంటే..

అత్యంత భారీ పక్షుల్లో ఆస్ట్రిచ్‌ది ప్రథమ స్థానం. ఆఫ్రికాకు చెందిన ఈ పక్షి ఎగరలేదు కానీ అమిత వేగంతో పరిగెడుతుంది. బరువు 131 కిలోల వరకూ ఉంటుంది

ఆస్ట్రేలియాలో కనిపించే ఈమూ కూడా ఎగరలేదు. ఇది నిలబడితే 6.2 అడుగుల ఎత్తు ఉంటుంది. సగటు బరువు 54 కిలోలు

ఆస్ట్రేలియా, న్యూగినియా దేశాల్లో కనిపించే సదరన్ కాసవేరీ పక్షి కూడా భారీగా ఉంటుంది. నెత్తిపై కొమ్ములాంటి ఆకారం ఉండటం దీని ప్రత్యేకత

నార్తన్ కాసవేరీ కూడా ఆస్ట్రేలియా, న్యూగినియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీని తలమీద కూడా కొమ్ములాంటి ఆకృతి ఉంటుంది

దక్షిణ అమెరికాకు చెందినఅత్యంత భారీ పక్షి రియా. దీనికి పొడవైన కాళ్లు ఉంటాయి. అవే వీటి ప్రధాన ప్రత్యేకత

ఆఫ్రీకాకు చెందిన భారీ పక్షి కోరీ బస్టర్డ్. ఇది కూడా ఎగరలేదు. దీని సగటు బరువు 20 కేజీలు

అమెరికా జాతీయ పక్షి అయిన బాల్డ్ ఈగల్ (గెద్ద) నైపుణ్యాలకు సాటిరాగల పక్షి మరొకటి లేదు. భారీగా ఉండే ఈ పక్షి ఎగరడంలో, వేటాడంలో అద్భుత ప్రతిభ కనబరుస్తుంది

సముద్రాలపై ఎగురుతూ కనిపించే వాండరింగ్ ఆల్బట్రాస్ కూడా భారీ పక్షే. వీటి రెక్కలు పూర్తిగా విప్పితే ఏకంగా11 అడగుల పొడవు ఉంటాయి.