సురక్షితమైన శృంగారం కోసం కండోమ్‌లు వాడుతుంటారు. 

రోగాల భయం లేకుండా ఉండాలంటే కలయిక సమయంలో దీన్ని వినియోగించడం తప్పనిసరి. 

కండోమ్ వాడకం, ప్రాధాన్యతను పక్కనబెడితే దానికి పెద్ద చరిత్రే ఉంది. 

200 ఏళ్ల నాటి ఓ కండోమ్‌ను ఇటీవల ఫ్రాన్స్‌లో గుర్తించారు. 

18వ శతాబ్దం నాటిదిగా చెబుతున్న దీన్ని వేలం వేయగా.. అక్షరాలా రూ.40,000 ధరకు అమ్ముడుపోయింది.  

ఇప్పుడు వాడుతున్న కండోమ్‌ల కంటే ఈ పురాతన కండోమ్ చాలా భిన్నంగా ఉంటుంది.  

గతంలో గొర్రెలు, పందులు, దూడలు, మేకలు వంటి జంతువుల పేగుల నుంచి కండోమ్‌లు తయారు చేసేవారు.  

అప్పట్లో ధనవంతులు మాత్రమే ఇలాంటి కండోమ్‌లు వినియోగించేవారట.