వెల్లుల్లి పొట్టు గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివీ!
వెల్లుల్లిని జీరో వేస్ట్ ఫుడ్ అని అంటారు. వెల్లుల్లి లాగే వీటి పొట్టులో కూడా పోషకాలు, విటమిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
వెల్లుల్లి పొట్టును దండిగా సేకరించి ఎండబెట్టి, గ్రైండ్ చేసి, జల్లించి మెత్తని పొడిని నిల్వ చేసుకోవాలి. దీన్ని పులుసులు, సూపులు, మసాలా వంటకాల్లోవాడితే చాలా మంచిది.
వెల్లుల్లి తొక్కలు ఘాటు వాసన కలిగి ఉంటాయి. తోటలో మొక్కల పాదుల్లో వీటిని చల్లితే క్రీమి కీటకాలు మొక్కలను టచ్ చేయలేవు.
చపాతీ, నాన్, పరాతా వంటివి తయారుచేయడానికి పిండి కలిపేటప్పుడు అందులో వెల్లుల్లి ఫ్లేక్స్ వేసి తయారుచేస్తే వాటి రుచి మెరుగవుతుంది.
వెల్లుల్లి పొట్టు మట్టిలో కలిసిన తరువాత నత్రజని, సల్ఫర్ ను విడుదల చేస్తుంది. మొక్కలకు కంపోస్ట్ గా దీన్ని ఇస్తే బాగా ఎదుగుతాయి.
వేగిన వెల్లుల్లి పొట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్, పులావ్, ఫ్రైలలో వెల్లుల్లి పొట్టును వేస్తే మంచి సువాసనతో పాటు రుచి కూడా ఇనుమడిస్తుంది.
జుట్టు బాగా పెరగడానికి వెల్లుల్లి టోనర్ వాడచ్చు. వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారినతరువాత దీన్ని జుట్టుకు స్ప్రే చేసి ఆరిన తరువాత తలస్నానం చేయాలి.
వెల్లుల్లి తొక్కలను జోడించిన హెర్భల్ టీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
దురదలు, దద్దుర్లు, చర్మం ఎర్రబడటం వంటి సమస్యలకు వెల్లుల్లి తొక్కలను ఉడికించిన నీటిని వాడచ్చు. ఇది వాడితే చర్మం మృదువుగా కూడా మారుతుంది.