ఉదయాన్నే టీ తాగే అలవాటుందా? మానుకోకపోతే ఈ సమస్యలు గ్యారెంటీ..
పరగడుపునే టీ తాగితే జీర్ణ వ్యవస్థ డిస్ట్రబ్ అవుతుంది. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ మొదలవుతాయి.
టీలోని టనిన్స్ అనే రసాయనాలు ఐరన్ శోషణను తగ్గిస్తాయి. టీ ఎక్కువగా తాగే వారిలో హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది.
పరగడుపునే టీ తాగడం వల్ల కడుపులో వికారం మొదలవుతుంది. అసౌకర్యంగా ఉంటుంది.
ఉదయాన్నే టీ తాగితే రోజంతా ఎసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్, హార్ట్ బర్న్ వంటి సమస్యలు చికాకు పెడతాయి.
పాలతో చేసిన టీ ఉదయాన్నే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలను పెంచేస్తుంది. ఫలితంగా చిరాకు, ఆందోళన వంటి మానసిక సమస్యలు వేధిస్తాయి.
పాలతో చేసిన టీ తాగడం వల్ల మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు సరిగ్గా శోషణం కావు.
ప్రతిరోజూ ఉదయాన్నే టీ తాగడం వల్ల కెఫిన్ డిపెండెన్సీ మొదలవుతుంది. టీ తాగకపోతే తలనొప్పి, చిరాకు వచ్చేస్తాయి.
ఉదయాన్నే కొవ్వు ఎక్కువగా ఉండే పాలలో పంచదార కలుపుకుని టీ తాగడం వల్ల బరువు పెరుగుతారు.
Related Web Stories
భక్తులకు 2 నుంచి 3 గంటల్లోగా దర్శన భాగ్యం
ఉషోదయ కిరణాలతో కలిగే ప్రయోజనాలు ఇవే!
ఒంట్లో ఒత్తిడి కారక హారోన్లు తగ్గేందుకు చేయాల్సిందిదే!
చికెన్ తింటే జలుబు తగ్గుతుందా.. వెంటనే రిలీఫ్ ఇచ్చే టిప్స్ ఇవే