ఈ వస్తువులను ఎవరికీ బహుమతిగా ఇవ్వకండి.. 

కొన్ని సాంప్రదాయాల ప్రకారం అద్దం బహుమతిగా ఇవ్వడాన్ని తప్పుగా భావిస్తారు. 

ఖాళీ పర్సులను గిప్ట్‌గా ఇవ్వకూడదట. అందులో రూపాయి కాయిన్ అయినా పెట్టి ఇవ్వాలట. 

కత్తులు, కత్తెరలు వంటివి బహుమతిగా ఇస్తే వారితో గొడవలు జరుగుతాయని నమ్ముతారు.

కొన్ని సంస్కృతుల్లో చేతి రుమాళ్లను బాధకు, విషాదానికి గుర్తుగా భావిస్తారు. కాబట్టి వాటిని గిఫ్ట్‌గా ఇవ్వకూడదు.

చెడుకు, విషాదానికి గుర్తుగా భావించే నలుపు రంగు దుస్తులను కూడా ఎవరికి గిఫ్ట్‌గా ఇవ్వకూడదట. 

ఎవరికైనా షూస్‌ను బహుమతిగా ఇస్తే వారు మీకు దూరమవుతారట. 

కొన్ని దేశాల్లో ముత్యాలను కన్నీళ్లకు ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే వాటిని గిఫ్ట్స్‌గా ఇవ్వరు. 

కొన్ని ఎడారి మొక్కలను నెగిటివ్ ఎనర్జీలుగా భావిస్తారు. వాటిని కూడా స్నేహితులకు ఇవ్వకూడదు.