అధిక చక్కెర పానీయాలు బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గులకు కారణమవుతాయి. వీటిని మానేయాలి.
ఎక్కువ ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, ఇన్స్టంట్ నూడిల్స్, ప్యాక్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తినడం మానేయాలి.
ప్రోటీన్, ఐరన్ బాగుంటుందని 30ఏళ్ళ తరువాత మాంసాహారం ఎక్కువ తినడం కూడా మంచిది కాదు. ముఖ్యంగా రెడ్ మీట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి, గుండె జబ్బుల ప్రమాదం పెరగడానికి కారణమవుతాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెస్టారెంట్ భోజనం, నిల్వ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. అధిక సోడియం ఆరోగ్యానికి మంచిది కాదు.
చక్కెరకు బదులుగా కృత్రిమ స్వీటెనర్లు తీసుకోవడం మంచిది కాదు. ఇవి గట్ బ్యాక్టీరియాకు అంతరాయం కలిగిస్తాయి.
మద్యపానం అలవాటుంటే 30ఏళ్ళ తరువాత తగ్గించాలి. ఇది కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. గుండె జబ్బులకు దోహదం చేస్తాయి.