పిల్లలకు అలవాటు చేయాల్సిన
మంచి అలవాట్లు ఇవే..!
పిల్లలకు స్కూల్ ఉన్నా లేకపోయినా కూడా అల్లారం సెట్ చేసి నిద్రలేవడం నేర్పాలి.
నిద్రలేవగానే మంచాన్ని, దుప్పటిని అలాగే వదిలేయకుండా కాస్త బెడ్‌ని సరిచేయడం నేర్పించాలి.
ఉదయాన్నే బ్రెష్ చేసుకుని, స్నానం చేయడం అనే అలవాటుని చిన్నతనం నుంచి ప్రోత్సహించాలి.
ధ్యానం పిల్లలకి ఎందుకు అనుకోకూడదు. చిన్నవయసు నుంచే పిల్లలకు ధ్యానం నేర్పించడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది.
మెరుగైన జ్ఞాపకశక్తిని పెంచే మరో అభ్యాసం చదువు.. ఉదయాన్నే కాసేపు చదువుకునేలా చూడాలి.
శరీర ఆరోగ్యానికి వ్యాయామం కూడా అంతే బాగా పనిచేస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది.
తగినంత నీరు తీసుకునేలా చూడాలి. ఇలా చేస్తే పిల్లలు డిహైడ్రేటెడ్‌గా ఉండరు.
అల్పాహారం విషయంలో కూడా మారాం చేయకుండా చూడాలి. పోష్టికాహారం తీసుకునే విధంగా అలవాటు చేయాలి.
స్కూల్‍కి వెళ్ళే క్రమంలో గుడ్ మార్నింగ్, పడుకునే ముందు గుడ్ నైట్ ఇంట్లో పెద్దవారికి చెప్పే విధంగా నేర్పించాలి.
Related Web Stories
భూమిపై అత్యంత వేగంగా వెళ్లే.. జంతువులు ఇవే..
భారత్లో పెంపుడు జంతువులుగా పెంచుకోకూడనివి ఇవే!
ముఖానికి వీటిని పొరపాటున కూడా నేరుగా అప్లై చేయవద్దు..
వారానికి ఎన్ని బీర్లు తాగవచ్చు.. నిపుణులు ఏం చెప్పారంటే..