చాణక్యుడు చెప్పిన ఈ 10 విషయాలు అనుసరిస్తే.. యువత విజయాల బాట పడతారు!

చంద్రగుప్త మౌర్యుడిని శక్తివంతమైన పాలకుడిగా తయారు చేసిన గొప్ప తత్వవేత్త ఆచార్య చాణక్యుడు.

కౌటిల్యునిగా ప్రసిద్ధి చెందిన ఈయన చెప్పిన 10 విషయాలు పాటిస్తే యువతకు విజయం తథ్యం.

నిత్యవిద్యార్థి.. జ్ఞానానికి అంతం లేదని,  జీవితంలో విజయం సాధించాలంటే ఎల్లప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలని చాణక్యుడు చెప్పాడు.

కోపం.. కోపమే అసలైన శత్రువు. ఇది మనస్సును పాడుచేస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. విజేతలు కావాలంటే కోపాన్ని అదుపుచేసుకోవాలి.

ఆరోగ్యం.. మంచి ఆరోగ్యం గొప్ప ప్రయత్నాల వైపు నడుపుతుంది.  ఆరోగ్యం సరిగా లేకుండా చేసే  ప్రయత్నాలు మధ్యలో ఆగిపోవచ్చు.

క్షమించడం.. క్షమాగుణం చాలా గొప్పది. ఎవరైనా నొప్పిస్తే వారిమీద కోప్పడకుండా, తిట్టకుండా వారిని క్షమించాలి. ఇది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది.

విద్య.. ఈ ప్రపంచంలో విద్యకంటే గొప్పది ఏదీ లేదు.  జీవితంలో ముందుకు సాగేందుకు, జ్ఞానాన్ని సంపాదించేందుకు విద్య చక్కని మార్గం. ఎప్పుడూ చదువుకుంటూ ఉండాలి.

సమయం.. సమయాన్ని ఆలోచనాత్మకంగా సద్వినియోగం చేసుకుంటే విజేతలు అవుతారు. జీవితాన్ని గొప్ప స్థానంలో ఉంచేది సమయమే.

అప్పు.. అప్పు తీసుకునే యువత లక్ష్యాల మీద దృష్టి పెట్టలేరు. అప్పు వల్ల జీవితంలో టెన్షన్,  ఒత్తిడి ఉంటాయి.

క్రమశిక్షణ.. క్రమశిక్షణ విజయానికి తొలి మెట్టు.  ఇదొక్కటి సరిగ్గా ఉంటే ఎన్నో విషయాలు వాటికవే సజావుగా జరిగిపోతుంటాయి. లక్ష్యాలు సాధించడం సులువు.

ఓపిక.. విజయం అనేది ఓపికతోనే సాధ్యమవుతుంది. . ఓటమి నుండి తప్పులు తెలుసుకుని మనసు పెట్టి విజయానికి కృషి చేయాలి.

స్నేహితులు.. జీవతంలో  మంచి స్నేహితులు ఎప్పుడూ విజయం వైపు ప్రోత్సహిస్తారు.  సుఖ దుఃఖాలలో తోడు ఉంటారు.  వైఫల్యాలలో వెన్ను తడతారు.