Thick Brush Stroke

'కలలకు రెక్కలు'  పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు

మహిళల కోసం 'కలలకు రెక్కలు' పేరుతో కొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది.

విద్యార్థినులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకునేందుకు వెబ్ సైట్‌ని(kalalakurekkalu.com) చంద్రబాబు ప్రారంభించారు.

సూపర్ సిక్స్‌లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు సీబీఎన్ చెప్పారు.

ఆడపిల్లలకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువుకు దూరమైతే వారు 'కలలకు రెక్కలు' అనే పథకాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఇంటర్ చదివిన విద్యార్థినులు పై చదువులు చదువుకునేందుకు బ్యాంక్ లోన్‌ ద్వారా అవకాశం కల్పిస్తారు. వారు తీసుకునే రుణాలకు ప్రభుత్వమే పూచీకత్తుగా ఉంటుంది.

కోర్సు కాలానికి ఋణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఈ పథకం అమలు చేయనుంది.