రియల్‌ఎస్టేట్ చూపు  అమరావతి వైపు

ఏపీలో ఎన్డీయే సర్కార్ అధికారం చేపట్టిన తరువాత రాజధాని అమరావతి ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతోంది. 

సీఎం చంద్రబాబు అనుభవంతో రాజధానిని ప్రపంచంలోనే ది బెస్ట్ నగరంగా తీర్చిదిద్దాలని అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. 

కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఆ ప్రాంతంలో భూముల ధరలు 60 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. 

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎకరా రూ.లక్షల్లో పలికిన భూముల ధరలు.. ఇప్పుడు రూ.5 - 10 కోట్లకు తగ్గట్లేదు.

రానున్న 3 - 6 నెలలపాటు అమరావతి ప్రాంతంలో భూముల ధరలు స్థిరంగా కొనసాగుతాయని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు. 

ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో వేగం పుంజుకుంటున్నకొద్ది రాజధాని ప్రాంతం విస్తరిస్తుందని.. అతి తక్కువ కాలంలోనే మహా నగరంగా అవతరించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.