టీడీపీ హయాంలోనే 90శాతం  ప్రాజెక్టులు జరిగాయని  ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు

రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు

వెలిగొండ, తోటపల్లి ప్రాజెక్టులు నేనే ప్రారంభించాను

ఉత్తరాంధ్ర జిల్లాల్లో నీటి కొరత, వర్ష పాతం ఎక్కువ

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు వల్ల సాగు దెబ్బతింటోంది

నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమను రత్నాలసీమగా చేయవచ్చు

గతంలో అనంతపురంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉండేది

ఉద్యాన పంటలతో ఆ జిల్లాలో తలసరి ఆదాయం 4-5 శాతానికి చేరింది

పట్టిసీమ చేపట్టిన తర్వాత సరైన సమయానికి పంటలు చేతికి అందే పరిస్థితి వచ్చింది

నదుల అనుసంధానంతో కరవు, వరద పరిస్థితులు ఎదుర్కోవచ్చు అని చంద్రబాబు అన్నారు