లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమస్యల   పరిష్కారానికి భారత్, చైనా  ముందుకొచ్చాయి

 భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతాలలో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి

 పెట్రోలింగ్ పునఃప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి

 భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని వెల్లడించారు

 ప్రస్తుత డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ తిరిగి ప్రారంభం కానుండగా

 త్వరలోనే మరికొన్ని ఏరియాల్లో  అమల్లోకి తీసుకొచ్చేందుకు  అధికారులు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు

 తూర్పు లడఖ్‌లో నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు

 బార్డర్‎లో శాంతి నెలకొల్పేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి

 కాగా, రష్యాలోని  కజాన్ లో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని మోడీ వెళ్లనున్నారు

ప్రధాని మోదీ బ్రిక్స్ దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు

 ఈ సమావేశాలలో చైనా నేతలు పాల్గొనున్నారు