నాగార్జున
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత
హైదరాబాద్ తుమ్మిడి
చెరువులో నటుడు నాగార్జునకు
చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతను
హైడ్రా అధికారులు ప్రారంభించారు
పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతను నిర్వహిస్తున్నారు
నాగార్జునకు సంబంధించి
ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై కొద్ది రోజుల
క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందింది
తుమ్మిడి చెరువును ఆక్రమించి మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నాగార్జున నిర్మించుకున్నారని ఫిర్యాదు వచ్చింది
ఈ క్రమంలో పక్కా ఆధారాలతో
శనివారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతకు ఉపక్రమించారు
కొద్ది రోజుల క్రితమే హైడ్రా
కమిషనర్ ఏవీ రంగనాథన్ అక్రమ నిర్మాణాలపై కీలక ప్రకటన చేశారు
చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలన్నీ కూల్చేస్తామని స్పష్టం చేశారు
Related Web Stories
ఉక్రెయిన్ రాజధాని కీవ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘హైడ్రా’
కర్ణాటక సీఎం సిద్దరామయ్య లక్ష్యంగా బీజేపీ ఆరోపణలు