బండెనక బండి కట్టి.. తరలివెళ్లిన ఏపీ ఓటర్లు

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు మే 13న పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఓటర్లు సొంతూళ్లకు తిరుగు పయనమయ్యారు. 

ఈ సారి ఏపీలో హై వోల్టేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీల నేతలు తమ తమ నియోజకవర్గాల ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారో వెదుక్కుని మరీ చార్జీలు ఇచ్చి .. ఓటుకు ఇంత అని చెప్పి మరీ పిలిపించుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. 

వరుస సెలవులు, ఎన్నికల నేపథ్యంలో వేలమంది జనం ఊరి బాట పట్టడంతో మహాత్మాగాంధీ, జేబీఎస్ స్టేషన్‌లు ప్రయాణికులతో రద్దీగా మారాయి.

రద్దీ భారీగా ఉండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని  పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది. 

ఎస్ఆర్ నగర్ వద్ద బస్సుల కోసం ఎదురు చూస్తుండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  హైదరాబాద్ నుంచి రైళ్లు, బస్సులు, విమానాలు అన్నీ ఫుల్ అయిపోయాయి. 

ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వాహనాలు వరసగట్టడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది.