సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మరోసారి స్ట్రాంగ్ కౌంటర్

తిరుమల లడ్డూపై వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా వైరం జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రకాశ్‌రాజ్‌ సోషల్‌ మీడియా ద్వారా వెలిబుచ్చిన అభిప్రాయాన్ని తాను తప్పుగా అర్థం చేసుకోలేదని పవన్ అన్నారు. 

ప్రకాశ్‌రాజ్‌ ఉద్దేశం తనకు సరిగానే అర్థమైందని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌తో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. 

దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో తాను స్పందించానని స్పష్టం చేశారు.

 ‘ఢిల్లీలో మీ స్నేహితులు’ అంటూ కామెంట్‌ చేయాల్సిన అవసరం ప్రకాశ్‌రాజ్‌కు లేదు అని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

ఆయన పోస్ట్‌ను తాను తప్పుగా అర్థం చేసుకోలేదని తేల్చిచెప్పారు.

ప్రకాశ్‌రాజ్‌ ఉద్దేశం తనకు సరిగానే అర్థమైందని చెప్పారు.

 ప్రకాశ్‌రాజ్‌ తనకు మంచి మిత్రుడు అని వివరించారు. 

రాజకీయంగా దారులు వేరైనా తమ మధ్య ఒకరంటే ఒకరికి గౌరవం ఉందని చెప్పారు. 

సినిమాల్లో ప్రకాశ్‌రాజ్‌‌తో కలిసి పనిచేయడం తనకు ఇష్టమని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.