ఏపీలోని పలు అంశాలపై పార్లమెంట్‌లో  చర్చ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని  కోరామని శ్రీకృష్ణదేవరాయలు  తెలిపారు

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా

దిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు 

పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి వచ్చాయి

ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయంపై సభలో చర్చించాలని కోరాం అని

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు

ఆయిల్‌ రిఫైనరీ, కడప స్టీల్‌ప్లాంట్‌తో ఏర్పాటు చేయాల్సిన పెండింగ్‌ సంస్థల గురించి వెల్లడించాలని కోరాం

గోదావరి-పెన్నా నదుల అనుసంధానంపై అడుగులు ముందుకు పడలేదు

ఇది పూర్తిచేస్తే సుమారు 10లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది

అందుకే నదుల అనుసంధానంపై చర్చించాలని విజ్ఞప్తి చేశాం అని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు