కాంగ్రెస్‌  ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజం 

కాంగ్రెస్‌లో అంత్యర్యుద్ధం జరుగుతోందని విమర్శించారు.

కమీషన్ల విషయంలో మంత్రుల మధ్య సఖ్యత లేదని ఆరోపించారు.

కాంగ్రెస్‌లో ఏమైనా జరగొచ్చు.. వాళ్లలో వాళ్లు ఏమైనా చేసుకోవచ్చు అని ఆక్షేపించారు.

సినిమాపై 14 శాతం కమీషన్ మీదే రేవంత్ ప్రభుత్వం బతుకుతోందని బండి సంజయ్ ఆరోపించారు.

ముగ్గురు మంత్రుల బండారం బయటపెడతానని హెచ్చరించారు.

బ్రోకర్లను పెట్టుకుని బిల్లులు మంజూరు చేస్తున్నారని బండి సంజయ్‌ ధ్వజమెత్తారు.

మంత్రులందరికీ సీఎం కావాలని ఉందని ఆరోపించారు.

ఢిల్లీకి డబ్బులు పంపడం వల్లే.. సీఎం పదవి నిలబడుతోందని  ఎద్దేవా చేశారు. 

డబ్బులు ఇవ్వకుంటే మంత్రుల కుర్చీలు కూడా ఉండవు అని బండి సంజయ్‌ ఆరోపించారు.