అంబేద్కర్ పై అమిత్‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది

పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలు అందులో భాగమేనని రాహుల్‌గాంధీ ఆరోపించారు

ఢిల్లీలోని కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు

పార్లమెంట్‌ సమావేశాలకు ముందు అదానీ లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైందని

దాని పై చర్చించాలని తాము కోరామని, కానీ ఆ చర్చ జరగకుండా 

సమావేశాలు మొదలైనప్పటి నుంచీ బీజేపీ ఇదే పనిచేస్తోందని ఆయన ధ్వజమెత్తారు

బీజేపీ, ఆరెస్సెస్‌ ఆలోచనాసరళి ఎప్పుడూ రాజ్యాంగం, అంబేద్కర్ కు వ్యతిరేకంగా ఉంటుందని

అందుకే ఆయన జ్ఞాపకాలను చెరిపివేయాలని కోరుకుంటున్నాయని రాహుల్‌ మండిపడ్డారు

ఇరువర్గాల ఆందోళనలతో పార్లమెంట్‌ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది

ఇందులో బీజేపీకు చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు

రాహుల్ తోయడం వల్లే వారు గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది