ఎవరీ పల్లవి.. బీజేపీ ఎందుకు టికెట్ ఇచ్చింది?
పల్లవి శ్రీనివాస్ డెంపో.. దక్షిణ గోవా నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగిన తొలి మహిళ.
తన అఫిడవిట్‌లో పల్లవి తెలిపిన ఆస్తులెంతో తెలుసా.. భర్తతో కలిపి అక్షరాల రూ.1,361 కోట్లని వెల్లడించారు.
మూడో దశ పోలింగ్ రేసులో ఉన్న 1352 మంది అభ్యర్థుల్లో.. అత్యంత సంపన్నురాలిగా పల్లవి నిలిచారు.
ఎలాంటి రాజకీయ అనుభవం లేని
ఆమెకు బీజేపీ టికెట్ ఇవ్వడానికి కారణం.. దాతృత్వ నేపథ్యమేని అంటున్నారు.
49 ఏళ్ల పల్లవి ‘టింట్లో’ కుటుంబంలో జన్మించారు. గోవాలోని మార్గావ్‌లో ఆమె పుట్టి పెరిగారు.
పుణెలోని ఎంఐటీ నుంచి ఎంబీఏలో పీజీ చేసిన పల్లి.. 1997లో డెంపో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీనివాస్‌ను పెళ్లాడారు.
డెంపో చారిటీస్ ట్రస్టీగా పల్లవి ఎన్నో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా బాలికల విద్యను పెంపొందించే కృషి చేస్తున్నారు.
2019-2024 మధ్య పల్లవి భర్తకు చెందిన కంపెనీలు ఎన్నికల బాండ్లు కొనడం, అవి బీజేపీ ఖాతాలోకి వెళ్లడం కలకలం రేపింది.
పల్లవి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు. తొలిసారి ఆమె రాజకీయాల్లో దిగి, తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
తన మనసులో రాజకీయాలు లేవని, బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి తాను ముందడుగు వేస్తున్నానని పల్లవి తెలిపారు.
దక్షిణ గోవా కాంగ్రెస్ కంచుకోట. ఈసారి ఎలాగైనా ఇక్కడ నెగ్గి తీరాలని, పల్లవిని బీజేపీ రంగంలోకి దింపింది.
Related Web Stories
చంద్రబాబుపై ప్రజల అభిమానానికి నిదర్శనం ఇదే..!
అప్పుల ఊబిలోకి ఏపీ.. 28 రోజుల్లో రూ.10 వేల కోట్ల అప్పు
Diffrence Between YSRCP and TDP Manifesto
వైసీపీ VS టీడీపీ మేనిఫెస్టో.. ఎందులో ఏముంది..