పదేళ్లలో కేసీఆర్‌ చేయలేని పనులను  మేం పది నెలల్లో చేసి చూపించాం

పదేళ్లలో ఏం వెలగబెట్టారని మమ్మల్ని దిగిపొమ్మంటున్నారు అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు

అభివృద్ధి జరగాలంటే భూసేకరణ చేయాల్సిందేనని,

భూములు కోల్పోయిన వారిని ప్రభుత్వం అక్కున చేర్చుకోవడంతో పాటు మూడు రెట్ల పరిహారం ఇస్తుందని సీఎం చెప్పారు

పరిశ్రమలు తెస్తే ఉద్యోగాలు వస్తాయని తాము శ్రమిస్తుండగా

ప్రతిపక్షాలు భూసేకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు

నేనేమీ లక్ష ఎకరాలు సేకరించట్లేదు

1,100 ఎకరాలు తీసుకుంటామంటే ప్రపంచ సమస్యలా దిల్లీలో ఫిర్యాదు చేశారు

భూసేకరణ చేయొద్దా? పరిశ్రమలు పెట్టవద్దా? నిరుద్యోగులకు ఉపాధి కల్పించొద్దా దీనికి కేసీఆర్‌ జవాబు చెప్పాలి

కేటీఆర్, హరీశ్‌రావులు మా కాళ్లల్లో కట్టె పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు