తెలంగాణ రాజకీయాల్లో మరో  సంచలన పరిణామం చోటు చేసుకుంది

కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

గవర్నర్‌ నుంచి అనుమతి రావడంతో ఏసీబీ ఇక విచారణను ప్రారంభించనుంది

మొదట కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేసింగ్‌లో భారీ స్కాం జరిగినట్లు రేవంత్ సర్కార్ గుర్తించింది

నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులు జరిగాయని విచారణలో బయటపడింది

రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీతో ఒప్పందం, చెల్లింపులు జరిగినట్లు తేలింది

ఆర్థిక శాఖ అనుమతులు లేకుండానే ఎమ్‌ఏయూడీ నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థలకు చెల్లింపులు జరిగాయి

ఈ విచారణలో కేటీఆర్ సూచనలతోనే చెల్లింపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు