ఫ్యాన్ గుర్తుతో ఓటర్లకు కుక్కర్లు, ప్లాస్క్‌లతో పాటు గిఫ్ట్‌లను అందజేస్తున్నట్లు వైసీపీ నేతలపై ఎంపీ రఘురామ సీఈసీకి ఫిర్యాదు చేశారు.

 వైసీపీ నేతలు జోగి రమేశ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌లు బహుమతులు పంచడం, చర్చీలలో ప్రచారం చేస్తున్న వీడియోలను జతచేసి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

అధికారులు సైతం వైసీపీ నేతల నుంచి బహుమతులు అందుకుంటున్నారని, ఇది వారి సర్వీస్ రూల్స్‪కి విరుద్ధమని ఫిర్యాదులో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

చర్చీలలో పాస్టర్ల వద్ద వైసీపీకి ఓటు వేయాలని ప్రమాణం చేయించినట్లు జోగి రమేశ్ వీడియోలను సీఈసీకి అందజేశారు.

మతం పేరుతో ఓట్లు అడుగుతున్న జోగి రమేశ్‪ను అనర్హునిగా ప్రకటించాలని ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు.

ఎంపీ రఘురామ ఫిర్యాదుపై సీఈసీ సీరియస్ అయింది. నివేదిక పంపించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది.