తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు  ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమం చేపట్టారు

అదానీ ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ వంటి అంశాలతో పాటు 

మణిపూర్ అల్లర్లు, విధ్వంసాలపై కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ పిలుపునిచ్చింది ఏఐసీసీ

దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని నిర్వహించింది

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు

కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు

దేశ ప్రజలారా ఇకనైన కళ్లు తెరవండి అని ఉన్న ప్లకార్డును పట్టుకొని నిరసనను తెలిపారు

అనంతరం రాజ్‌భవన్‌ సమీపంలో రోడ్డుపై సీఎం రేవంత్‌, మంత్రులు, నేతలు బైఠాయించారు