జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం

మాజీ సీఎం జగన్ పాలనలో ఏపీలో ఆర్థిక విధ్వంసం జరిగి రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 

2019-24మధ్య రాష్ట్రంలో భారీగా జరిగిన ఆర్థిక నిర్వహణ లోపాలపై శ్వేతపత్రాన్ని చంద్రబాబు అసెంబ్లీలో సమర్పించారు. వైసీపీ అయిదేళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదన్నారు. 

అమరావతిని జగన్ దుర్మార్గంగా దెబ్బ తీశారని, అభివృద్ధి పనుల్లో ఇప్పుడు వేగం పెరిగిందని చెప్పారు. 

జగన్ వల్ల విద్యుత్ రంగంలోనే రూ.లక్ష 29 వేల కోట్లు అప్పులు పేరుకుపోయాయన్నారు. 

రాష్ట్రంలో తలసరి అప్పు రూ.లక్ష 44వేల 336కి చేరిందని.. ఇది టీడీపీ హయాంలో రూ.74 వేల 790గా ఉండేదన్నారు. 

రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగలేదని, దీంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. ఏపీలో పెద్ద పట్టణాలు ఎక్కువగా లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించిందన్నారు.