రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు

అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు

నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి 

ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని

ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ

ఒక సీఎం విలాసం కోసం పర్యావరణ విధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మించుకోవడం చేయలేదన్నారు

రుషికొండ ప్యాలెస్ చూస్తే మొదట ఆశ్చర్యం, తర్వాత ఉద్వేగం కలుగుతుందన్నారు

ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కోసం 400కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ 

రుషికొండ కోసం 420 కోట్లు పెట్టారన్నారు