పల్నాడు జిల్లా యల్లమందలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు.

యల్లమందలో శారమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు. 

 పేదరికం లేని సమాజం ఎన్టీఆర్ కల అని చెప్పారు.

సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలని అన్నారు.

కష్టాల్లో ఉన్న పేదలకు అండగా ఉండాలని తెలిపారు.

 పేదరికం లేని సమాజం నా జీవిత ఆశయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రజల స్థితిగతులు తెలుసుకుని న్యాయం చేయడానికే ఇక్కడకు వచ్చానని అన్నారు.

వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి ధ్వంసం చేశారు

 కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ దారి మళ్లించేశారు

గతంలో సీఎం వస్తే పరదాలు కట్టేవారు

 గాడి తప్పిన ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్నా అని సీఎం చంద్రబాబు తెలిపారు.