పనిచేయకుంటే వేటు తప్పదు.. అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్

జక్కంపూడిలో విధులు సరిగా నిర్వర్తించని ఓ అధికారిని సస్పెoడ్ చేశానని తెలిపారు. 

వీఆర్‌లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించలేదనే ఫిర్యాదులు ఉన్నాయని.. ఈ అంశంపై విచారణ జరిపిస్తున్నానని అన్నారు. 

క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకు బాధ్యతలు అప్పగించాలనేది మంచి ఉద్దేశంతో జరిగిందా లేక తొందర పాటులో అయిందా అనేది పరిశీలిస్తున్నామని  సీఎం చంద్రబాబు వెల్లడించారు. 

ఏ రకంగా బాధ్యతలు అప్పగించినా పని చేయాలనే మానవత్వం సదరు అధికారులకు ఉండాలి? అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 

టోల్ ఫ్రీ నంబర్లు పనిచేయట్లేదనే ఫిర్యాదు తన దృష్టికి వచ్చిందని సీఎం అన్నారు.

ప్రభుత్వ వ్యవస్థ ఐదేళ్లుగా పక్షవాతం వచ్చినట్లుగా పడి ఉందని విమర్శించారు. 

కొత్త కంట్రోల్ రూమ్ వ్యవస్థ ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. 

తప్పుడు వార్తలు ఇచ్చి ఓ వర్గం మీడియా మరింత పరువు తీసుకోవద్దని సీఎం హెచ్చరించారు. 

36 డివిజన్లలో విధుల్లో ఉన్న అధికారులే ఆహార పంపణీకి బాధ్యత వహించాలని చంద్రబాబు ఆదేశించారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోలేని చోటకు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా మూడు పూటలా ఆహారం అందించాలని సూచించారు.

100 శాతం ఆహారం పంపిణీ జరగాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 

5 లక్షల ప్యాకెట్ల ఆహారంతో పాటు నీటిని కూడా పంపిణీ చేశామని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు.

5 హెలీకాఫ్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతోందని సీఎంకు అధికారులు తెలిపారు. 

ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.