టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు.
తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు.
తిరుమల తిరుపతిలో ప్రశాతంతకు భంగం కలగకూడదని తేల్చి చెప్పారు.
భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని చెప్పారు.
తిరుమల వచ్చిన ప్రతి భక్తుడి అనుభవాల గురించి అభిప్రాయం చెప్పే అవకాశం కల్పించాలని సీఎం సూచించారు.
భక్తుల సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు.
టీటీడీ సేవలు మరింత మెరుగుపడాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
తిరుమల ఆలయంలో వీఐపీ సంస్కృతి తగ్గాలని సీఎం అభిప్రాయ పడ్డారు.
Related Web Stories
హర్ష సాయికి లుక్ అవుట్ నోటీసులు జారీ
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు
సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు