తిరుమల లడ్డూపై టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

తిరుమల లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష  నిర్వహించారు. 

టీటీడీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. 

శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భక్తుల ఆవేదనను తమ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. వైసీపీ హయాంలో లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు బయటపడ్డాయని చెప్పారు.

తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.

భక్తుల విశ్వాసాలను, ఆలయ సంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.