హైదరాబాద్‌లోని నాంపల్లి లలిత కళాతోరణంలో సోమవారం ఐఐహెచ్‌టీని వర్చువల్‌గా సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు
ఈ సందర్భంగా చేనేత అభయహస్తం లోగోను సీఎం రేవంత్ ఆవిష్కరించారు.
విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
వేద పండితుల ఆశీర్వచనం తీసుకుంటున్న సీఎం రేవంత్‌రెడ్డి
సభలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాయకులు, అధికారులు
సీఎం రేవంత్‌రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న నాయకులు
ఐఐహెచ్‌టీ నెల్లూరు, ఒడిశాలో మాత్రమే ఉండేదని సీఎం రేవంత్ తెలిపారు.
తెలంగాణలో ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులను గతంలో కోరామని సీఎం రేవంత్ గుర్తుచేశారు.
ఐఐహెచ్‌టీ ఏర్పాటుకు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చారని సీఎం రేవంత్ వివరించారు.
తెలంగాణకు తక్షణమే ఐఐహెచ్‌టీ మంజూరు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఈ ఏడాదే ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
నాంపల్లి తెలుగు అకాడమీలో ఐఐహెచ్‌టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని తమ ప్రభుత్వం యత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీకి ఫోర్త్ సిటీలో 60 ఎకరాలు కేటాయించామని చెప్పారు.
ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ పనులు ప్రారంభించామని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్‌టీకి గుర్తింపు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
ఐఐహెచ్‌టీ విద్యార్థులకు ప్రతినెలా రూ.2,500 స్కాలర్‌షిప్ ఇస్తున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ ప్రభుత్వంలో చేనేతల జీవన విధానంలో మార్పులు రాలేదని విమర్శించారు.
సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇచ్చినా కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిరిసిల్ల నేతన్నల బకాయిలు వెంటనే విడుదల చేశామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇందులో 63లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నారని చెప్పారు.
సిరిసిల్ల నేతకార్మికులను ఆదుకోవడానికి నిధులు విడుదల చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏడాది 2 చీరలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
చేనేతల రుణభారం రూ.30కోట్లు తీర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగాఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Related Web Stories
శ్రీకాకుళానికి భారీ వర్ష సూచన..
భారత అమ్ములపొదిలో అత్యంత శక్తిమంతమైన క్షిపణి ఇదే!
ఖైరతాబాద్ గణేశుడికి పూర్తైన తొలి పూజ.. హాజరైన రేవంత్
మహేష్ కుమార్ గౌడ్‌ను వరించిన అదృష్టం