కవిత అరెస్ట్‌పై రేవంత్ ఆసక్తికర కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే.

కవిత విషయంలో తండ్రిగా కేసీఆర్ ఇంకా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రేవంత్ అన్నారు. కనీసం పార్టీ సభ్యురాలిగా కూడా కవితను చూడడం లేదన్నారు.

ప్రధాని మోదీ, కేసీఆర్ కుమ్మక్కై చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని రేవంత్ విమర్శించారు. 

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు నాటకం ఆడుతున్నారన్నారన్నారు.  ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కవితను అరెస్ట్ చేయడం దేనికి సంకేతమని రేవంత్ ప్రశ్నించారు.

ముందు ఈడీ వస్తుందని.. ఆ తర్వాత మోదీ వస్తారని గతంలో అనేవారని.. కానీ నిన్న ఈడీ, మోదీ కలిసే వచ్చారని రేవంత్ సెటైర్ వేశారు.