మూసీ పై అఖిలపక్షానికి రెడీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్‌కు తనను కలవడం ఇష్టం లేకపోతే 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కైనా మూసీ పైనా అభిప్రాయాలు ఇవ్వండని సూచించారు

ఎలాంటి అభిప్రాయాలనైనా తీసుకోవడానికి తాను రెడీగా ఉన్నానని సీఎం చెప్పారు

చర్చ జరగకుండా అభివృద్ధి జరగదు.. తాను మూసీ పై చర్చ జరగాలని కోరుకుంటున్నాను

అందుకే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని సీఎం పేర్కొన్నారు

ఈటల రాజేందర్ మూసీ పైన చేస్తున్న అభ్యంతరాలు నిర్మాణాత్మకంగా లేవు

అతనిపైన కేటీఆర్, హరీష్ రావు ఒత్తిడి ఉందని సీఎం తెలిపారు

మూసీ పునర్జీవం కోసం రూ.1,50,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అనేది నిజం కాదు

నిధులన్నీ ప్రైవేటు సంస్థలతోనే సమీకరించి వాళ్లతోనే ఖర్చు చేయించి మూసీని సుందరీకరణ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు