కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోన్న సందర్భంగా ప్రభుత్వం ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది

వరంగల్‎లోని ఆర్ట్స్ కాలేజీలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ తొలి సభ నిర్వహించారు

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు

2014 నుండి 2018లో కేసీఆర్ కేబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని

మా కేబినెట్‎లో ఇద్దరు వరంగల్ మహిళలకు అవకాశం ఇచ్చామన్నారు

ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరురాలిని చేస్తామని

మా ప్రభుత్వంలో ఆడబిడ్డలే కీలకంగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేసేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని 

మాది మహిళల రాజ్యమని గర్వంగా చెబుతున్నానని ఆయన అన్నారు

అభివృద్ధిని అడ్డుకునే కుట్ర చేస్తే ఊరుకోమని.. ఎవరైనా సరే జైల్లో  పెట్టిస్తామని సీఎం హెచ్చరించారు