గౌతమి అదానీపై వివాదానికి, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని  సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు

అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు

అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు, ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారన్నారు

జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు

అదానీ ప్రకటించిన, రూ.100 కోట్లు స్వీకరించ కూడదని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రకటించారు

సీఎస్‌ఆర్‌ కింద స్కిల్స్‌ వర్సిటీకి ఇచ్చిన ఆ విరాళాన్ని బదిలీ చేయొద్దని అదానీ గ్రూప్‌నకు లేఖ పంపామని

నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు

రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే పెట్టుబడులు స్వీకరించినట్లు వెల్లడించారు

అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగ వద్దని ప్రతిపక్షాలకు సూచించారు