కాంగ్రెస్‌ రైతుల శ్రేయస్సు కోసం  చేసిందేమీ లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు

కాంగ్రెస్ సమస్యలను పరిష్కరించే బదులు జల వివాదాలను ప్రోత్సహిస్తుందని విమర్శించారు

రాజస్థాన్‌లో ఏర్పాటు చేసిన ‘‘ఏక్‌ వర్ష్‌ - పరిణామ్‌ ఉత్కర్ష్‌’’ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు

ప్రధాని మోదీ రూ.46,300 కోట్ల విలువ గల 24 ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభాలు చేసారు

21 జిల్లాలకు తాగు, సాగునీటిని అందించే పార్వతీ - కాలీసింధ్‌ - చంబల్‌ లింక్‌ ప్రాజెక్టు 

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ప్రగతిలో ప్రధానపాత్ర పోషిస్తుందని మోదీ తెలిపారు

నదుల అనుసంధానానికి ప్రతీకగా వివిధ నదుల నీటిని ప్రధాని ఓ కుండలో కలిపారు

ఈ కార్యక్రమంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ పాల్గొన్నారు

మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్, కేంద్ర మంత్రులు సి.ఆర్‌.పాటిల్, భగీరథ్‌ చౌధరి తదితరులు పాల్గొన్నారు