రూ.1,046 కోట్ల నిధులతో చేపట్టిన  18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో  ఉన్నాయని నితిన్‌ గడ్కరీ తెలిపారు

లోక్‌సభలో వైకాపా ఎంపీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి గడ్కరీ సమాధానమిచ్చారు

ఎన్‌హెచ్‌-216ఎపై మోరంపూడి, జొన్నాడ, ఉండ్రాజవరం జంక్షన్, తేతలి,

కైకరం వద్ద నిర్మిస్తున్న 5 వంతెనలు 2025 ఏప్రిల్‌ 2 నాటికి పూర్తవుతాయి

ఎన్‌హెచ్‌-16పై గొలగమూడి జంక్షన్, నెల్లూరు టీ జంక్షన్‌ల వద్ద నిర్మిస్తున్న రెండు వంతెనలు 2025 సెప్టెంబర్‌ 11కి

గుంటూరు మిర్చియార్డు వద్ద నిర్మిస్తున్న వంతెన జనవరి 6వ తేదీకల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం

ఎన్‌హెచ్‌-16పై నాగులుప్పలపాడు గ్రోత్‌సెంటర్, రాజుపాలెం జంక్షన్‌ల వద్ద

వంతెనల నిర్మాణాలకు అనుమతి లేఖలు ఇచ్చాం అని గడ్కరీ వివరించారు