అమరావతిలో సీఆర్‌డీఏ ఆఫీస్ నిర్మాణానికి డిజైన్లను రూపొందించింది. ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కోరుతోంది. 

అందుకోసం రూపొందించిన డిజైన్లను ఆన్‌లైన్‌లో పెట్టింది. 

మొత్తం10 డిజైన్లను రూపొందించింది.

వీటిలో తమకు నచ్చిన డిజైన్లపై క్లిక్ చేసి.. ఓటు వేయాలని ప్రజలకు సూచించింది. 

అన్నింటిని అత్యాధునిక హంగులతో డిజైన్ చేసింది. 

వీటిలో అధిక ఓటింగ్ వచ్చిన వాటిని ఎంపిక చేస్తామని ప్రకటించింది.

డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ డిజైన్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

రాజధాని నిర్మాణంలో సీఆర్‌డీఏ కీలక పాత్ర పోషిస్తుంది. 

రాజధాని అమరావతిని ప్రజా రాజధానిగా గతంలో అభివర్ణించిన సీఎం చంద్రబాబు

అందుకే సీఆర్‌డీఏ కార్యాలయం ఎంపికలో సైతం ప్రజల భాగస్వామ్యాన్ని కల్పిస్తుందీ ప్రభుత్వం