కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఢిల్లీ
కాలుష్యంపై స్పందిస్తూ కేంద్రంపై
విమర్శలు గుప్పించారు
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మారింది
ఇక్కడ ప్రమాదకర కాలుష్య
కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి
ఇలాంటి విపత్కర పరిస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా, కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదు
నవంబరు నుంచి జనవరి మధ్య ఈ నగరం నివాసయోగ్యంగానే ఉండట్లేదు
మిగతా సమయాల్లోనూ అంతంతమాత్రంగానే జీవనం సాగించగలం
ఇలాంటి పరిణామాల మధ్య ఢిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా? అని
శశిథరూర్ ప్రశ్నించారు
ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది
కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టడంలో అలసత్వంపై ఢిల్లీ సర్కారును ధర్మాసనం నిలదీసింది
ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో జీఆర్‌ఏపీ-4 లెవల్ ఆంక్షలు కొనసాగుతున్నాయి
Related Web Stories
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ స్పందించకపోతే ఎలా?
వరంగల్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మణిపూర్లో చెలరేగుతున్న హింస
పింఛన్లు పెంచుతామన్నారు.. ఒక్క రూపాయి పెంచలేదు