హిందూస్థాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో ప్రధాని ఉగ్రవాదం, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై చర్చించారు

ఈ రోజు నేను 26/11 దాడికి సంబంధించిన నివేదికలను ఎగ్జిబిషన్‌లో చూశాను

ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు పెద్ద ముప్పు

ఇప్పుడు ఉగ్రవాదులు తమ సొంత ప్రదేశాల్లో కూడా సురక్షితంగా లేరు

ఇక వారు మనల్ని భయపెట్టలేరు అని మోదీ అన్నారు

తమ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉందని అన్నారు

‘ప్రజల కోసం, ప్రజలచే అభివృద్ధి’ అనేది తమ ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యమన్నారు

స్వాతంత్య్రానంతరం భారతదేశంలో యువతలో రిస్క్ తీసుకునే స్ఫూర్తి కొరవడిందని,

అయితే గత 10 ఏళ్లలో ఇది పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ తెలిపారు

ప్రస్తుతం భారతదేశంలో 1.25 లక్షలకు పైగా నమోదైన స్టార్టప్‌లు ఉన్నాయని,

మన యువత దేశం గర్వించేలా చేయాలని ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు