వైసీపీ మాజీ ఎంపీ ఇంట్లో ఈడీ సోదాలు
వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. విశాఖపట్నం మధురవాడ భూమి కొనుగోలు కేసులో తనిఖీలు చేపట్టిన అధికారులు ఏకకాలంలో సోదాలు జరిపారు.
సత్యనారాయణతోపాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలోనూ కొనసాగాయి. హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్, కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయాల్లోనూ ఈడీ బృందాలు తనిఖీ చేశాయి.
రూ.12.5 కోట్ల లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో ఎంవీవీపై ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయి.
తాజాగా ఎంవీవీ ఆడిటర్ వెంకటేశ్వరరావుతోపాటు గద్దె బ్రహ్మాజీ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. దాడుల సమయంలో సత్యనారాయణ ఇంట్లో లేరని అధికారులు చెబుతున్నారు.
మరోవైపు హైగ్రీవా ఇన్‌ఫ్రాటెక్ ఓనర్ రాధారాణి, కంపెనీ ఎండీ జగదీశ్వరుడు ఇళ్లల్లోనూ తనిఖీలు జరిగాయి.
Related Web Stories
ఏపీ రాజధాని అమరావతిలో పనులు పున:ప్రారంభం
గ్రూప్-1 బాధితులతో బండి సంజయ్ ర్యాలీ
హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల్లోనే..
ఇజ్రాయెల్ కాల్పులలో మరణించిన హమాస్ అగ్రనేత