ఆర్థికవేత్తగా, ప్రధానిగా అపార  ప్రతిభాపాటవాలు కనబరిచారు  మన్మోహన్ సింగ్ 

మౌన ప్రధాని అంటూ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు

కానీ 2018 లో ఆయన పై వచ్చిన విమర్శలకు దీటైన సమాధానం ఇచ్చారు

మన్మోహన్ సింగ్ తన ప్రయాణంలోని కీలక ఘట్టాలను ఆరు పుస్తకాలుగా ఛేజింగ్ ఇండియా పేరిట విడుదల చేశారు

 నన్ను మౌన ప్రధాని అని విమర్శించారు కానీ నేను ఏమిటన్నది ఈ పుస్తకాల్లో స్పష్టంగా తెలుస్తుంది

విదేశీ పర్యటనలు ముగించుకొచ్చిన ప్రతిసారీ పత్రికా సమావేశం నిర్వహించేవాడిని

నాటి పత్రికా సమావేశాల తాలుకు చర్చల సారాంశాలు అనేకం ఈ పుస్తకాల్లో ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు

1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మన్మోహన్ సింగ్‌ను ఆర్థికమంత్రిగా నియమించారు 

దేశ చరిత్రలో ఇది ఓ కీలక మైలురాయి అని చరిత్రకారులు అభివర్ణించారు

ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన మన్మోహన్ సింగ్ భారీ స్థాయిలో సరళీకరణ విధానాలు ప్రవేశపెట్టారు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే