బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళిసై

తెలంగాణ, పుదుచ్చేరిల మాజీ గవర్నర్  తమిళి సౌందరరాజన్ బీజేపీలో చేరారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటరయ్యారు.

రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవి చేపట్టాలంటే ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యత్వం కలిగి ఉండరాదు.

అందుకే.. గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాలపై ఫోకస్ పెట్టారు.

త‌మిళ‌నాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానం నుంచి త‌మిళిసై పోటీ చేసే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.