అమరావతిలోని సచివాలయంలో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి సబ్సిడీ మొత్తాన్ని అందించారు
ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది
మొదటి ఉచిత సిలిండర్‌కు రూ.894 కోట్లను పెట్రోలియం సంస్థలకు ప్రభుత్వం అందించింది
దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు ఉచితంగా అందించనుంది
మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది
29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు కల్పించింది
గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది
సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే
Related Web Stories
విచారణకు హాజరైన రాజ్ పాకాల
కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్
కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదు