తొలి ఏడాది పాలనలో రుణమాఫీ పథకం అమలుకు పూర్తి ప్రాధాన్యమిచ్చిన  రేవంత్‌రెడ్డి ప్రభుత్వం

రెండో సంవత్సరంలో రైతులకు సంబంధించిన ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది

శాసనసభ, శాసనమండలిలో ఇటీవల రైతు భరోసాపై చర్చ పెట్టారు

యాసంగి సాగు ఊపందుకోకముందే.. రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని ప్రభుత్వం భావిస్తోంది

గతంలో ఎకరానికి రూ. 5 వేలు చెల్లించగా, ఇప్పుడు 50 శాతం పెంచారు

ఎకరానికి రూ. 7,500 చొప్పున పంపిణీ చేయనున్నారు

రెండు పంటలకు కలిపి ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు రైతుభరోసా పథకంలో చెల్లిస్తారు

సంక్రాంతి నుంచి ఈ పథకం అమలులోకి రానుంది

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియను కూడా సంక్రాంతి నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది

కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ యాంత్రీకరణ

తదితర సంక్షేమ పథకాలపై కేబినేట్‌ భేటీలో చర్చించనున్నారు