జీ20 సదస్సు లో భాగంగా వివిధ దేశాల అధినేతలతో ప్రధాని మోదీ భేటీ అవుతున్నారు
ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ను మోదీ కోరారు
తప్పుడు ఎల్వోయూలతో 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నీరవ్ మోదీ మోసగించారు
2018 డిసెంబర్లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ ప్రభుత్వం భారత్‌కు తెలియజేసింది
దీంతో అతడిని అప్పగించాలని భారత్ బ్రిటన్ ప్రభుత్వంకు విజ్ఞప్తి చేసింది
మరోవైపు విజయ్ మాల్యా భారత్‌లో రూ.9వేల కోట్ల మేరకు బ్యాంకు రుణం ఎగవేశాడు
ఈ కేసులో సీబీఐ భారత్‌ను వీడి విజయ్ మాల్యా పారిపోయినట్లు తెలిపింది
ఆర్థిక నేరగాళ్ల అప్పగింత విషయంలో బ్రిటన్ ప్రభుత్వం తొలినుంచి సానుకూలంగానే ఉన్న
కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల ఈ ప్రక్రియ ‘క్లిష్టతరం’గా మారుతోంది
ఈ నేపథ్యంలో బ్రిటన్ లో ఉంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీని అప్పగించాలని మోదీ కోరారు
Related Web Stories
ఒక వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలు రాష్ట్రానికి శాపంగా మారాయి
రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు
ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ
ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ స్పందించకపోతే ఎలా?