బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

శ్రీకాకుళంలో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి.

చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

శ్రీకాకుళం పట్టణంలో ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది.

శ్రీకాకుళం డే అండ్ నైట్ జంక్షన్ వద్ద వరద నీటిలోనే ప్రయాణిస్తున్న వాహనదారులు

భారీగా వాన రావడంతో నీటితో నిండిపోయిన బస్టాండ్ ప్రాంగణం

వరదనీరు చేరడంతో బస్టాండ్ ప్రాంగణంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు

భారీ వర్షాలకు వంశధార నదిలో జలకళ

పంట పొలాల్లోకి చేరిన వరద నీరు

సోమవారం శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ