స్వర్ణాంధ్ర విజన్-2047కు సాయం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు
ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు
గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందన్నారు
వచ్చే నెలలో మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు,
ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై ఆయనతో చంద్రబాబు చర్చించారు
పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు
ఏపీకి కీలకమైన రెండు ప్రాజెక్టులను గాడిన పెట్టడానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు
అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన వేర్వేరుగా భేటీ అయ్యారు
వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర నిధుల విడుదలపై చర్చించారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక సాయం చేయాలని కోరారు
Related Web Stories
ఉద్యోగ నియామక దరఖాస్తు ఫారాలపైనా కూడా జీఎస్టీ వసూలు
2047 కల్లా వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోగలం
యాసంగి నుంచి రైతు భరోసా అమలుకు సర్కారు నిర్ణయం
ఐదేళ్ల విధ్వంసానికి పరిష్కారం దొరకట్లేదు